Teaching |
Vidya Nagar Hyderabad |
Last Date to Apply : 03 Jul 2024 |
*ప్రకటన:*
కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ గారి ఆదేశాలననుసరించి, విద్యానగర్ లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులను అవర్లీ బేసిస్ లో నియమించడానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుకన్య అర్హులైన అభ్యర్థులను తేది. *03.07.2024* సాయంత్రం 5 గంటలలోపు తమ కళాశాల ఆఫీసులో దరఖాస్తు చేసుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నారు.
*ఇంటర్వ్యూ తేది* : 06.07.2024 ఉదయం 10.00 గంటలకు.
*పోస్ట్ ల వివరాలు* :
ఆంగ్లం -2,
సంస్కృతం -1,
వాణిజ్య శాస్త్రం - 1,
బి.బి.ఎ. - 1,
కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ - 7,
గణితం - 1.
మొత్తం పోస్టులు=13
*అర్హతలు* :
1)పి.జి.లో మినిమం 55% మార్కులు (50% ఎస్సీ/ఎస్టీలకు)
2) సంబంధిత సబ్జెక్టులో Ph.D. కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. Ph.D. అభ్యర్థులు లేని పక్షంలో NET/SET అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వీరు కూడా లేని పక్షంలో PG అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
3) బోధనానుభవం కలిగిన వారికి వెయిటేజి ఇస్తారు. వీరు తమ సర్వీస్ సర్టిఫికెట్ సమర్పించాలి.
*సూచన* :
*అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్ లతో ఇంటర్వ్యూకు హాజరు కావలెను.
**ఇంటర్వ్యూ జరుగు స్థలము* :
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఖైరతాబాద్, హైదరాబాద్.
ప్రిన్సిపాల్
వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యానగర్
By Sravanthi at 29 Jun 2024